సప్తవర్ణాలు కలిసి ఇంద్రధనుస్సై పండిత పామర రంజకమైనట్లే పద్యం, ధార, ధారణ, చమత్కారం, కవిత్వం, సంప్రదాయం, సమస్యాపూరణం అనే ఏడు విశిష్ట లక్షణాల అద్భుతమైన మనోహరమైన సమాహారమే అవధానమనే సాహిత్య ప్రక్రియ.
తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సాహిత్య ప్రక్రియ.
ఇప్పటికీ తెలుగువారికి మాత్రమే సొంతమైన ప్రక్రియ.
ప్రఖ్యాత జంట కవులుగా మాత్రమే కాక, జంట అవధానులుగా పేరు పొందిన తిరుపతి వేంకటకవుల వల్లనే పద్యం ద్వారా చెప్పే భావం సామాన్య ప్రజల హృదయాన్ని తట్టి లేపింది. అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా నాడు తిరుపతి వేంకట కవుల పద్యాలు పంటపొలాల్లో పరవశించి రాగయుక్తంగా పాడేవారంటే... అది ‘అవధాన’ ప్రభావం అనేది అతిశయోక్తి కాదు.
పరిపూర్ణ సామాజిక స్పృహ ఉన్న సాహితీ ప్రక్రియ అవధానం ఒక్కటే. పండిత పామర రంజక సాహితీ ప్రక్రియ అవధానం.
డా|| గరికిపాటి వారి అవధానం:
అవధానాల్లో సమస్యా పూరణాలంటే పెంకి గుఱ్ఱాల మీద స్వారీ వంటిది. వీటి నిర్వహణలో డా||గరికిపాటి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత జగమొండి సమస్యల్నైనా మనం ముక్కుమీద వేలువేసుకొని విస్తుపోయే విధంగా పూరించడం వీరి ప్రత్యేకత.
పృఛ్ఛకుడు అవధాని భరతం పట్టడానికి సమస్య ఇస్తే అది వారికే తగిలేలా వీరి పూరణ వస్తుంది. అవధాని నుండి ఒక రసవత్తరమైన పద్యం రాబట్టడానికి ఇస్తే అదే పద్ధతిలో వీరి పూరణ ఉంటుంది. సమస్యలని బట్టి పద్య పూరణ అంతే స్థాయిలో చెయ్యగల సమర్ధులు.
అవధానాన్ని ఒక తపస్సులా భావించి తదేక పవిత్ర దీక్షతో శారదాదేవి కటాక్ష సిద్ధిని పొందిన అవధాని డా||గరికిపాటి నరసింహా రావు.
1992 విజయ దశమి నాడు అవధాన రంగప్రవేశం చేసి ఇంతవరకు 275 కి పైగా అష్టావధానాలు, 8 అర్ధ శత, శత, ద్విశత సహస్రావధానాలు సమర్ధవంతంగా నిర్వహించించి అవధాన బ్రహ్మ రాక్షసుడు వంటి విశిష్టమైన బిరుదులను, అనేకనేక సన్మానాలను, పురస్కారాలను అందుకున్నారు డా|| గరికిపాటి నరసింహారావు.

   
మొట్టమొదటి ద్విశతావధానం కార్యక్రమం, ఏలూరు   శతావధానం, 9, 10 అక్టోబరు, 1994  

మహా సహస్రావధానం, వరల్డ్ రికార్డు స్థాపన:

     

1996 మే నెల కాకినాడలో మహా సహస్రావధానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 116 మంది పృఛ్ఛకులు 21 రోజుల్లో 750 పద్యాలను ఏకధాటి ధారణతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది.
హైటెక్ అవధానం:
2001 వ సంవత్సరంలో అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానం
2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష నిరణ.