తల్లిదండ్రులు శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ వెంకట సూర్యనారాయణ
పుట్టిన తేదీ 14-09-1958, భాద్రపద శుద్ధ పాఢ్యమి
జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారం
విద్యార్హతలు ఎం.ఎ., ఎం.ఫిల్, పిహెచ్. డి.,
ఉద్యోగ జీవితం 30 సంవత్సరాలుగా తెలుగు అధ్యాపకత్వం
ప్రపంచ రికార్డు 1116 పద్యాలు (5000 పంక్తులు) కలిగిన స్వీయకావ్యం ‘సాగరఘోష’ 8 గం||ల్లో ఏకధాటి మహాధారణ (విశాఖపట్నం, కాకినాడ,హైదరాబాదు నగరాలలో)
సహస్రావధాన ప్రతిభ 1996 మేలో కాకినాడలో మహాసహస్రావధానం (1116 మంది పృచ్ఛకులు - 21 రోజులు -750 పద్యాల ఏకధాటి ధారణతో)
హైటెక్ అవధానం 1) అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానం (2001)
2) బెంగుళూరులో ప్రయోగశాలలో మేథా పరీక్షావధానం (2006)
విదేశీ పర్యటనలు అమెరికా, సింగాఫూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్ , కువయట్, అబుదాభి, దుబాయి, కతార్  మొదలైన ఎన్నో దేశాల్లో ఎన్నోసార్లు అవధానాలు చేశారు. ఉపన్యాసాలు ఇచ్చారు.
సత్కారాలు – పురస్కారాలు 1) ఎం.ఫిల్ లో తెలుగు విశ్వవిద్యాలయంలో సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)

2)తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)

3) సెప్టెంబరు లో కొప్పరపు కవుల పురస్కారం (2011)

4) సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం (2012)

5) లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం (2015)

6) గురజాడ విశిష్ట పురస్కారం (2016)

7) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే "కళారత్న"హంస పురస్కారం(2017)

8) పి.వి.నరసింహారావు స్మారక పురస్కారం (2018)
9) రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం (2018)

‘సాగరఘోష’ కావ్యానికి పురస్కారాలు 1) 2002 లో ‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు)

2) 2003 లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం

3) 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

4) 2005 లో ‘సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు)

5) 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

6) తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

7) పుట్టపర్తి నారాయణాచార్య పురస్కారం, ఒంగోలు, 2014

8) వివేకానంద పురస్కారం, 2018

రచనలు
1) సాగర ఘోష (పద్య కావ్యం)   2) మనభారతం (పద్య కావ్యం)
3) భాష్ప గుచ్చం (పద్య కావితా సంపుటి)   4) పల్లవి (పాటలు)
5) మహా సహస్రావధానం   6) ద్వి శతావధానం
7) ధారధారణ   8) కవితా ఖండికా శతావధానం
9) మౌఖిక సాహిత్యం (పరిశోధన)   10) పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
11) మా అమ్మ (పద్యాలు)   12) అవధాన శతకం
13) శతావధాన భాగ్యం   14) శతావధాన విజయం
15) The Voice of the Ocean English translation to “Sagaraghosha” kaavyaM)   16) వైకుంఠపాళి (ఆధ్యాత్మిక వ్యాస సంపుటి)
17) సాగర ఘోష - వ్యాఖ్యానంతో సహా   18) OCCEAN-BLUES (సాగరఘోష ఆంగ్లానువాదం.


‘గరికిపాటి’ రచనలపై పరిశోధన 1) సాగరఘోష పై 2 ఎం.ఫిల్సు

2) సాగరఘోష పై పి.హెచ్.డి.

3) మొత్తం రచనలపై పి.హెచ్.డి.
సి.డి.లు
1) పలకరిస్తే పద్యం (హాస్య పద్యాలు)   2) శివానంద లహరి
3) సౌందర్య లహరి   4) కనకధారా స్త్రోత్రము
5) భక్త ప్రహ్లాద   6) గజేంద్ర మోక్షము
7) కాశీ ఖండము   8) భగవద్గీత
9) శకుంతలోపాఖ్యానము   10) శ్రీ కాళహస్తి మాహాత్మ్యం
11) శ్రీ కాళహస్తి శతకం    
డి.వి.డిలు 1) సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా)
టి.వి.కార్యక్రమాలు
  1. భర్తృహరి సుభాషితాలు - ఈటీవి లైఫ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం ఉదయం 6:00 గం. తిరిగి అదేరోజు సాయంత్రం 6:౦౦గం.లకు, రాత్రి 11:00గం.లకు పునఃప్రసారం.
  2. భగవద్గీత – బాలవికాసం -శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) లో ప్రతి శుక్రవారం రాత్రి 8.30గం.లకు తిరిగి శనివారం ఉ.10:00గం.లకు
  3. నవ జీవన వేద -ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి లో నవ జీవన వేదం ప్రతి రోజు ఉదయం 6:30 గం.
  4. గరికపాటి ప్రవచనాలు -శ్రీ చక్ర భక్తి ఛానల్ - ప్రతిరోజు ఉ 07:00 గం.లకు
  5. చమక్కులు (తెలుగు వెలుగు) -ఈ.టి.వి - చమక్కులు (తెలుగు వెలుగు) - ప్రతి ఆదివారం ఉదయం 11.30 గం.
  6. దూరదర్శన్ - మంచి కుటుంబం - ప్రతి శనివారం సాయంత్రం 5.30 గం మరియు ఆదివారం ఉదయం 7.30 గం.
  7. భక్తి ఛానల్ - పాండురంగ మాహాత్మ్యం - ప్రతిరోజు రాత్రి 08:00 గం.లకు.
  8. ఓం ఛానల్ - మను చరిత్ర కావ్య వ్యాఖ్యానం గరికిపాటి వారి అబ్బాయి శ్రీ గరికిపాటి గురజాడ వారిచ ప్రతిరోజు రాత్రి 07:00 గం.లకు
  9. ఆధాన్ - యూట్యూబ్ ఛానల్ - భర్తృహరి సుభాషితాలు గరికిపాటి వారి అబ్బాయి శ్రీ గరికిపాటి గురజాడ వారిచే

అవధాన రంగప్రవేశం 1992 విజయ దశమి
అష్టావధానాలు 300 కి పైగా
శతావధానాలు 10
మహా సహస్రావధానం 1
బిరుదులు ప్రవచన కిరీటి, ధారణా బ్రహ్మ రాక్షసుడు
భార్య శ్రీమతి వెంకట రమణ ( శారద )
కుమారులు చి|| శ్రీ శ్రీ,    చి|| గురజాడ

 

 

తెలుగులో మాట్లాడుకుందాం!!