పుస్తకం : సాగరఘోష (పద్యకావ్యం)
 

వెల రూ : 200/-

 

సాగరఘోష’ కావ్యానికి పురస్కారాలు

2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

2003 లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం

2005 లో ‘సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు)

2002 లో ‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు)

2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

పరిశోధనలు:

  • సాగరఘోష పై 2 ఎం.ఫిల్సు

  • సాగరఘషపై పి.హెచ్.డి. సాగరఘోష - సామాజికాద్వైతం

  • మొత్తం రచనలపై పి.హెచ్.డి

  • కావ్య పరిచయం:

    ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే. . భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్ళనాటి భూమి పుట్టుకనుండి నిన్న మొన్నటి గుజరాత్ భూకంపం వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్యకావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగాను, ఆనంద దాయకంగాను తీర్చిదిద్దుకోవాలని, పరమార్ధం గురించి ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆది శంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన కావ్యం.

    ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక అశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయినా ఇతివృతం కొత్తది. ఒకానొక ప్రౌఢవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చుని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్టుగా భావించి, కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది. ‘స్వచ్ఛంగా ఉండవలసిన నీటి కెరటానివి, ఇలా ఉన్నావేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుండి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకువెడతానని అర్ధిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని అర్ధిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగర ఘోష.

    యావత్ ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రను భారతీయ తాత్త్విక చింతనా నేపథ్యంలో వర్ణించే ఈ కావ్యరచన మంచికోసం, మార్పుకోసం.. మనిషికోసం..

 

 

పుస్తకాల కొరకు:

     అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‌మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 9989333156 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ :  kiran.nethi10@gmail.com

మరియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.