పుస్తకం : సాగరఘోష - సామాజికాద్వైతం (సిద్ధాంత గ్రంధం)

శ్రీ గరికిపాటి వారి సాగరఘోష పై డా. తలారి వాసు గారి పి.హెచ్.డి.
 

రచన : డా. తలారి వాసు

వెల రూ : 120/-

 

కావ్య పరిచయం:

సూర్యుడు అస్తమించాడని మనం నిద్రపోతున్నాం. అదే సూర్యుడు ఉదయించాడని అమెరికాలో మేల్కొంటున్నారు. ఇక్కడ అస్తమించాడు. అక్కడ ఉదయించాడు. సూర్యుడు ఒకలాగానే ఉన్నాడు. సూర్యుడు అస్తమించలేదు - ఉదయించనూలేదు. అక్కడే స్థిరంగా ఉన్నాడు. ఉదయాస్తమయాలనేది మన భ్రమ. `జగన్మిధ్య’ అన్నది శంకరులు అందుకే! ఉన్నది ఒక్కటే. రెండు కాదు. అదే అద్వైతం.

సమాజ విఘ్ణవుకు సహస్రబాహూవులు. అలవాట్లు, ఆచార వ్యవహారాలు, దృక్పథాలు, ఆశయధర్మాలు, సంస్కృతి నాగరికతలు, భిన్నమనస్తత్వాలు, విభిన్న వేషభాషలు, పలు వర్ణవర్గాలు కలిగిన జనుల ఏకత్వ సహజీవనమే సమాజం. ఇటువంటి సమాజంలో ఎన్నో అంగాలు. ఎన్నెన్నోరంగాలు, మరెన్నో అంతరంగాలు, ఈ అంతరంగ తరంగ పరంపర ఒక మహోదధి. ఈ మహా సాగరఘోష అమేయం, అనంతం, పరిమితం. ఈ భిన్నత్వంలో ఏకత్వ దర్శనమే సామాజికాద్వైతం.

మహాసహస్రావధాని శ్రీగరికిపాటి వారి సాగరఘోష పద్యకావ్యం సాక్షాత్తు ఈ భువన ఘోష! సమాజ సింధువును ఏకత్వ దృష్టితో దర్శించినపుడే విశ్వమానవ భావనకు అంకురార్పణ. అందుకే ఈ పరిశోధన.
 

 

 

పుస్తకాల కొరకు:

అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‍మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 8341577766 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ : kiran.nethi10@gmail.com

మరియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.