పుస్తకం : పల్లవి (పాటలు)

 

ఇది పల్లవి - మృదు పల్లవి!

ఇది పలికే స్వరలహరులు -

తెలుగంతటి తెల్లవి!! 

బోసి నవ్వు జాబిలిలా

రసమయ మీ పల్లవి!

తెలుగు వేణిలో మెరిసే

వెలుగు మల్లి పల్లవి!

రంగుల హరివింటి సొబగు

రంగరించు పల్లవి!

రాలిపోవు సుమగళమున

రాగమలదు పల్లవి!

ప్రణయ లయ స్పందనలో

ప్రణవమైన పల్లవి

దేశభక్తి జీవన సం-

దేశమైన పల్లవి!

చీకటి రేఖల వేకువ

చిలుకరించు పల్లవి!

ఆకు మీది శిశువు మురళి

ఆలపించు పల్లవి!

- తమ్మ సత్యనారాయణ, తిరుపతిపురం, పశ్చిమ గోదావరి జిల్లా.

 

 

పుస్తకాల కొరకు:

అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‌మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 8341577766 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ : kiran.nethi10@gmail.com

రియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.