పుస్తకం : మౌఖిక సాహిత్యం

 

 అప్పజెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం సాహిత్యంలో రెండు ప్రధానమైన ధోరణులు. అప్పజెప్పడం పాండిత్యమైతే, అప్పటికప్పుడు చెప్పడం ఆశు కవిత్వం. ఈ రెండు విద్యలూ మౌఖికమే.

మౌఖిక సాహిత్యమే ఎన్నో వేల ఏళ్ళ నుండి ఉంటూ వెయ్యేళ్ళ లిఖిత సాహిత్యానికి వస్తువుని, ఛందోరీతుల్ని అందించింది. అయితే లిఖిత రూపం అందులోనూ అచ్చురూపం వచ్చాక మౌఖిక ధోరణి మారిపోయింది. మౌఖిక సాహిత్యం సాధించిన ప్రయోజనాలు దాని ముద్రిత రూపం సాధించలేకపోతోంది. మౌఖకం కొత రూపాలతో రేడియో, టేప్, గ్రాంఫోన్, టి.విల ద్వారా మనముందుకు వస్తోంది.

నేటికీ పల్లె మనుషులు పదాలు పాడినా, అతివలు అప్పగింతల పాటలు పాడినా, అవధానులు ఆశువుగా పద్యాలు చెప్పినా, భిక్షుకులు తత్త్వగీతాలు ఆలపించినా అది మౌఖిక సాహితీ స్వరమే.

మొదటిసారిగా తెలుగులో మౌఖిక సాహిత్యాన్ని విశ్లేషించే గ్రంథం ఇది.

 

   

పుస్తకాల కొరకు:

అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‍మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 8341577766 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ : kiran.nethi10@gmail.com

రియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.