శ్రీ గరికిపాటి నరసింహారావు

మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత), భాద్రపద శుద్ధ పాడ్యమి, 1958 సెప్టెంబర్ 14వ తేదీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికిపాటివారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.

1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు.

ఇంకా చదవండి
డా. గరికిపాటి గురజాడ

డా. గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ,   ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.

డా. గరికిపాటి గురజాడగారు 23 ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి, 2015 డిసెంబర్ 20, రోజున ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 200కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీమద్దేవీభాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతే కాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.

ఇంకా చదవండి
అవార్డులు