Books

మనుచరిత్ర - వ్యక్తిత్వ వికాసం

కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చమత్కారాలు ఛలోక్తులు

కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Navodaya Book House


3-3-865,Opp Arya Samaj mandir,
Kachiguda,Hyderabad,
Pin Code: 500027,
Telangana,India.
Mob:+91-9000413413, Office:040-24652387
Email:NavodayaBookHouse@gmail.com
Web: www.TeluguBooks.in


Gurajada

డా. గరికిపాటి గురజాడ


డా. గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ, ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.

డా. గరికిపాటి గురజాడగారు 23 ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి, 2015 డిసెంబర్ 20, రోజున ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 200కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీమద్దేవీభాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతే కాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర కావ్యంపై డా. గురజాడగారు ఎం. ఫిల్ చేశారు. ‘మనుచరిత్ర: వ్యక్తిత్వవికాసం’ అనే అంశం పై వారి సిద్ధాంత వ్యాసాన్ని 2015లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. మనుచరిత్ర కావ్యంపై పలుమార్లు ప్రసంగించి, మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాన్ని 2020లో వెలువరించారు. గురజాడగారు ‘ఆంధ్ర మహాభారతం- సామాజికాంశాల పరిశీలన’ (ఆది పర్వం నుండి విరాట పర్వం వరకు) అనే అంశంపై పిహెచ్. డి పూర్తిచేసి తన సిద్ధాంత గ్రంథాన్ని 2020లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

కవిత్రయ భారతంపై ప్రత్యేకమైన ప్రసంగాలు చేసిన గురజాడగారు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘భారతంలో చిన్న కథలు’ అనే ధారావాహికకి శ్రీకారం చుట్టి ఆ కథలు నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఆధునికమైన సమన్వయం చేస్తున్నారు.

చిత్రమాలిక


అవార్డులు


  • పిహెచ్.డిలో అత్యుత్తమ పరిశోధనకు గాను, కేంద్ర మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా, కె. కామేశ్వరీదేవి స్మారక స్వర్ణ పతక బహూకరణ, 2022.
  • ఎం. ఫిల్. తెలుగు (2014- 15)లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం, 2015.
  • ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీదుగా స్వర్ణ పతక బహూకరణ, 2014.
  • సిలికానాంధ్ర, టీవీ.9 వారు సంయుక్తంగా నిర్వహించిన ‘తెలుగాట’ పోటీ, ద్వితీయ ప్రకరణంలో ద్వితీయ స్థానం, 25,000 నగదు బహుమతి, 2014.
  • ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారం, 2014.
  • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావుగారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009.
  • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగుకి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఏ.పి. జే. అబ్దుల కలాం గారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009.

సామాజిక మాధ్యమాలు



Awards

అవార్డులు

బిరుదులు

ప్రవచన కిరీటి

అనుష్ఠాన వేదాంతి

ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997)

సహస్రభారతి (1996)

అవధాన శారద (1995)

శతావధాన గీష్పతి (1994)

అమెరికా అవధాన భారతి

శతావధాన కళా ప్రపూర్ణ

సత్కారాలు, పురస్కారాలు

రాష్ట్రపతి భవన్ లో అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతులు మీదుగా "పద్మశ్రీ" పురస్కారం, 2022

శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆకృతి సంస్థ వారి "సంస్కార్" అవార్డును ప్రదానం, 2022

రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018

పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018

గురజాడ విశిష్ట పురస్కారం, 2016

లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015

శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013 (విశాఖ ఉక్కు కర్మాగారం)

తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి వారిచే ప్రదానం, 2012

సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2012

కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం, 2011

అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం, 2008

సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు), 2005

నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ), 2004

తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం, 2003

‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002

తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000

ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ, 1989

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు
జయంతి రామయ్యపంతులు అవార్డు, 1978


Calendar

Events


Gallary

శ్రీగారికిపాటి

గురజాడ

ఫారిన్ విసిట్

ఈవెంట్స్

అవార్డ్స్

ఒథెర్


యూట్యూబ్ గేలరీ


శ్రీ గరికిపాటి

శ్రీ గరికిపాటి నరసింహారావు

మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత), భాద్రపద శుద్ధ పాడ్యమి, 1958 సెప్టెంబర్ 14వ తేదీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికిపాటివారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.

1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెలలో, కాకినాడ పట్టణంలో 1116 మంది పృఛ్ఛకులతో 21 రోజులపాటు మహాసహస్రావధానం చేసి, 750 పద్యాల ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరుపొందారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ‘ధారణా బ్రహ్మరాక్షసుడు’, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులను చెప్పవచ్చు. గరికిపాటివారు ఎన్నో పురస్కారాలను, సన్మానాలను అందుకున్నారు.

డా. గరికిపాటివారు 1116 పద్యాలు (సుమారు 4500 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగరఘోష’ ను 8గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతే కాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001 లో నిర్వహించి ఔరా అనిపించారు. 2006 లో బెంగళూరు ప్రయోగశాలలో మేథాపరీక్షావధానం కూడా జరిగింది. గరికిపాటివారు తెలుగురాష్ట్రాలలోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు.

నిత్యం టి.వీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూమతం విశిష్టతను తెలియజెప్పడంలో వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. భక్తి టీవీలో 1818 భాగాలుగా ప్రసారమైన ‘ఆంధ్ర మహాభారతం’, ఏ.బి.ఎన్ లో 2000 భాగాలుగా ప్రసారమైన ‘నవజీవన వేదం’ కార్యక్రమాలతో గరికిపాటివారు కొత్త ఒరవడిని సృష్టించారు. ఇవే కాకుండా ఎన్నో కావ్యాలపై, ఆధ్యాత్మిక అంశాలపై రోజూ గరికిపాటివారి ప్రవచనాలను ప్రేక్షకులు టీవీలలో ఆస్వాదిస్తూనే ఉన్నారు. లోతైన ఆధ్యాత్మిక విషయాలను సైతం అత్యాధునిక సమాజానికి సమన్వయం చేస్తూ ‘సామాజిక వ్యాఖ్య’ కు శ్రీకారం చుట్టి ప్రవచన రంగంపై గరికిపాటి వారు తమదైన ముద్ర వేశారు.

సాగరఘోష, వ్యక్తిత్వదీపం, వైకుంఠపాళి, ఇష్టదైవం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిన గరికిపాటివారు, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలలో ప్రసంగాలు అందుబాటులో ఉంచి, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు.


Home

శ్రీ గరికిపాటి నరసింహారావు


మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత), భాద్రపద శుద్ధ పాడ్యమి, 1958 సెప్టెంబర్ 14వ తేదీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికిపాటివారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.

1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు.

ఇంకా చదవండి
డా. గరికిపాటి గురజాడ

డా. గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ,   ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.

డా. గరికిపాటి గురజాడగారు 23 ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి, 2015 డిసెంబర్ 20, రోజున ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 200కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీమద్దేవీభాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతే కాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.

ఇంకా చదవండి
అవార్డులు